ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చలో కలెక్టరేట్‌ ఉద్రిక్తత

ABN, First Publish Date - 2020-09-23T06:04:35+05:30

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేయడంతో పాటు అర్హులైన పేదలందరికి డబుల్‌ బెడ్‌రూంలను మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం జనగామ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేయాలని బీజేపీ ధర్నా

గేట్లపై నుంచి దూకిన కార్యకర్తలు

ఇండోర్‌ అద్ధాలు ధ్వంసం


జనగామ(లింగాలఘణపురం), సెప్టెంబరు 22 :

 ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేయడంతో పాటు అర్హులైన పేదలందరికి డబుల్‌ బెడ్‌రూంలను మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం జనగామ కలెక్టరేట్‌ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. కార్యకర్తలు మొదటగా తహసీల్దార్‌ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా బయలుదేరగా అప్పటికే మోహరించిన పోలీసులు మెయిన్‌ గేట్‌ వద్ద బీజేపీ శ్రేణులను అడ్డుకున్నారు.


దీంతో పోలీసులకు, కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల వలయాన్ని ఛేదించుకుని కొందరు మెయిన్‌గేట్‌పై నుంచి దూకి కలెక్టర్‌ చాంబర్‌వైపు చొచ్చుకుపోయారు. అప్పటికే అప్రమత్తమైన పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకునే చర్యలు చేపడుతుండగా ఆగ్రహంతో ఊగిపోయిన బీజేపీ కార్యకర్తలు ఇండోర్‌ అద్ధాలను ధ్వంసం చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాగా, అదుపులోకి తెచ్చేందుకు జనగామ డీసీపీ శ్రీనివా్‌సరెడ్డి, ఏసీపీ వినోద్‌కుమార్‌, సీఐ మల్లేశ్‌యాదవ్‌ కలెక్టరేట్‌కు చేరుకుని బీజేపీ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు.


ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు మాట్లాడుతూ ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దుతోపాటు పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూంలు ఇచ్చేవరకు పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా  నాయకులు ప్రేమలతారెడ్డి, సౌడ రమేశ్‌, ఊడ్గుల రమేశ్‌, కొంతం శ్రీను, పవన్‌ శర్మ, పిట్టల సత్యం, గుజ్జుల నారాయణ, పెద్దోజు జగదీష్‌, నాగారపు వెంకట్‌, బొట్ల శ్రీనివాస్‌, మహిపాల్‌, నర్సింహ్మారెడ్డి, రాంకోటితో పాటుగా బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా, బీజేపీ ధర్నా కార్యక్రమానికి రియల్‌ఎస్టేట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఆలూరి రమేశ్‌, చిన్నా తదితరులు సంఘీభావం తెలిపారు.


30 మందిపై కేసులు నమోదు..

కలెక్టరేట్‌ వద్ద ఇండోర్‌ అద్దాల ధ్వంసానికి కారణమైన 30 మంది బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్లు సీఐ మల్లేశ్‌యాదవ్‌ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసినవారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి సౌడ రమేశ్‌, విద్యాసాగర్‌, పిట్టల సత్యం, ఊడుగుల రమేశ్‌,  వల్లాల ఉపేందర్‌, జగదీష్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నాగారపు వెంకట్‌, నాయకులు కొంతం శ్రీను, బొట్ల శ్రీనివా్‌సలతో పాటు పలువురున్నారు.

Updated Date - 2020-09-23T06:04:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising