అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి
ABN, First Publish Date - 2020-12-30T05:13:07+05:30
అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి
దుగ్గొండి మండల పర్యటనలో కలెక్టర్ ఆదేశం
దుగ్గొండి, డిసెంబరు 29: డంపింగ్ యార్డులు, శ్మశాన వాటిక తదితర అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ హరిత అన్నారు. మంగళవారం నాచినపెల్లి, చాపలబండ, రాజ్యతండా, అడవి రంగాపురం గ్రామాల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామాల్లో చేపడుతున్న డంపింగ్ యార్డులను, శ్మశానవాటిక, పల్లె ప్రకృతి, వన నర్సరీల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులకు, సర్పంచ్‌లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీపీఆర్‌వో సంపత్‌రావు, ఎంపీడీవో పల్లవి, సర్పంచ్‌లు రజిత, రవీందర్‌నాయక్, కొండెం రమాదేవి, ఎంపీటీసీ పిండి కుమారస్వామి, ఎంపీవో శ్రీధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వైకుంఠధామాలను అందుబాటులోకి తేవాలి..
వరంగల్ రూరల్‌కల్చరల్: జిల్లాలో నిర్మాణంలో ఉన్న వైకుంఠధామాల పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఎంపీడీవోలు, డీఎల్‌పీవో, ఎంపీవోలతో పల్లె ప్రగతి, నర్సరీలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డ్ పురోగతిపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మండలాల్లో పను లు వేగవంతంగా జరగడం లేదని, అధికారులు తగుచర్యలు తీసుకోవాలన్నారు. డంపింగ్ యార్డులను పూర్తి చేసి వినియోగంలోకి తేవాలన్నారు. మండల సమాఖ్య సమావేశంలో తడి, పొడి చెత్తను వేరు చేయడం పై ఎజెండాలో పెట్టి అవగాహన కల్పించాలన్నారు. మండలాల వారీగా వైకుంఠధామాల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో డీఆర్‌డీవో పీడీ సంపత్‌రావు, సీఈవో రాజారావు, డీఎల్‌పీవోలు, ఎంపీడీవోలు, ఏపీవోలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-30T05:13:07+05:30 IST