ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక క్వారీలను పరిశీలించిన ఇన్‌చార్జి కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-11-24T10:27:33+05:30

మండలంలోని కుదురుపల్లి ఇసుక క్వారీని ఇన్‌చార్జి కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య సోమవారం పరిశీలించారు. ‘ఇసుక.. ‘బల్క్‌’ మస్కా’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై స్పందించారు. క్వారీల్లో జరుగుతున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన 


మహదేవపూర్‌, నవంబరు 23: మండలంలోని కుదురుపల్లి ఇసుక క్వారీని ఇన్‌చార్జి కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య సోమవారం పరిశీలించారు. ‘ఇసుక.. ‘బల్క్‌’ మస్కా’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై స్పందించారు. క్వారీల్లో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టి తనకు నివేదిక అందజేయాలని తహసీల్దార్‌ విఠలేశ్వర్‌ను ఆదేశించారు. రెండు రోజుల క్రితం జేసీ స్వర్ణలత  మహదేవపూర్‌-1, బొమ్మాపూర్‌-1 ఇసుక క్వారీలను పరిశీలించారు. క్వారీకి సంబంధించిన అధికారులు లేకపోవడం, సిబ్బందికి ఐడీకార్డులు లేకపోవడం తదితర అంశాలపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తహసీల్దార్‌ నివేదికను రూపొందించి కలెక్టర్‌కు పంపారు. క్వారీల్లో టీఎ్‌సఎండీపీ సిబ్బంది కాకుండా ఇతరులు విఽధుల్లో ఉన్నారని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులకు టీఎ్‌సఎండీసీ సిబ్బంది సమాచారం ఇవ్వడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో మహదేవపూర్‌-1, బొమ్మాపూర్‌- 1 క్వారీల నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినట్టు తహసీల్దార్‌ చెప్పారు.

Updated Date - 2020-11-24T10:27:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising