ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టాలి
ABN, First Publish Date - 2020-12-30T04:24:44+05:30
ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టాలి
కలెక్టర్ వీపీ గౌతమ్
మహబూబాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు అధికారులు నిఘా పెంచాలని కలెక్టర్ వీపీగౌతమ్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం తహసీలార్లతో సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రెవెన్యూ సిబ్బందికి విధులు కేటాయించాలని సూచించారు. అక్రమ రవాణాకు పాల్పడే ట్రాక్టర్ యాజమానులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో తహసీల్దార్లు రమేష్, పుల్లారావు, సాంబశివుడు, రమే్‌షబాబు పాల్గొన్నారు.
అయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించాలి
బయ్యారం : అయిల్ ఫామ్ తోటల సాగు పెంపొందించేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బయ్యారంలో మంగళవారం పర్యటించిన కలెక్టర్ బయ్యారం, జగ్గుతండాల్లోని నర్సరీలను పరిశీలించారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.కార్యక్రమంలో బయ్యారం ఎంపీపీ చేపూరి మౌనిక, సర్పంచ్‌లుకోటమ్మ, రమేష్, మండల ప్రత్యేక అధికారి రామకృష్ణరావు, తహసీల్దార్ తరంగిణి, ఎంపీడీవో చలపతిరావు, పంచాయతీ రాజ్ డీఈ అరవింద్ బాబు, ఏవో రాంజీనాయక్, డీఆర్వో సుధాకర్, ఈజీఎస్ ఏపీవో మాధవి, ఎంపీవో కిషోర్ కుమార్ పాల్గొన్నారు.
Updated Date - 2020-12-30T04:24:44+05:30 IST