ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగేష్‌ దృష్టంతా ఆదాయంపైనే!

ABN, First Publish Date - 2020-10-01T08:03:07+05:30

తాజా మాజీ అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ లంచం కేసుకు సంబంధించి ఏసీబీ దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలోనూ పలు భూ.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గతంలో అనుమతి  పొందిన ఇసుక రీచ్‌లపై పునఃసమీక్ష

ఎందుకు అలా చేయాల్సి వచ్చిందనేదానిపై ఏసీబీ ఆరా


హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తాజా మాజీ అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ లంచం కేసుకు సంబంధించి ఏసీబీ దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలోనూ పలు భూ వ్యవహారాలకు సంబంధించి బాధితుల నుంచి భూములు రాయించుకున్నట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది. అలాగే రెండు ఇసుక రీచ్‌లకు సంబంధించి ఓ మాజీ అధికారి ఇచ్చిన అనుమతులపై ఆయన పదవీ విరమణ తర్వాత.. అదనపు కలెక్టర్‌ స్థాయిలో నగేష్‌ తన అధికారాన్ని ఉపయోగించి పునఃసమీక్ష జరిపినట్లు ఏసీబీ అధికారుల దృష్టికొచ్చింది. ఇసుక రీచ్‌ల యజమానులకు ఇబ్బందులు కలిగించడం వల్ల వారి నుంచి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఈ అంశానికి సంబంధించిన ఫైళ్లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఏసీబీ విచారణకు పెద్దగా సహకరించని నగేష్‌ కేసులో బయటి సాక్ష్యాల ఆధారంగా అతనిపై మోపిన అభియోగాల్ని కోర్టులో నిరూపించేందుకు అధికారులు ఆధారాల్ని సేకరిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ నుంచి నగేష్‌ లబ్ధి పొందారంటూ పలువురు బాధితులు ఇప్పటికే ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించారు. వారు ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన ఆధారాల్ని అధికారులు సేకరిస్తున్నారు. 

Updated Date - 2020-10-01T08:03:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising