కూలిన కోట గోడ.. నాలుగు ఇళ్లులు ధ్వంసం
ABN, First Publish Date - 2020-10-15T18:06:54+05:30
జనగామ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది.
జనగామ: జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఖిలాషాపురంలో సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన కోట గోడ కూలింది. 18వ శతాబ్ధంలో ఈ కోట నిర్మించారు. ఈ ఘటనతో కోట కింద ఉన్న నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ముందే గమనించిన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
కొన్ని రోజుల క్రితమే ప్రభుత్వం పర్యటక ప్రాంతంగా ఈ కోటను ప్రకటించింది. కోట సుందరీకరణకు రూ. 4కోట్ల 50 లక్షలు మంజూరు చేసింది. అయితే ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. కోట గోడలు కూలే పరిస్థితి ఉందని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు.
Updated Date - 2020-10-15T18:06:54+05:30 IST