ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టోన్‌ బిల్డింగ్‌ కూల్చివేత!

ABN, First Publish Date - 2020-02-08T08:30:58+05:30

సెక్రటేరియట్‌ భవనాలను కూల్చివేసి కొత్తవి నిర్మించాలనే పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ క్రమంలో వాటి పరిసర ప్రాంతాల్లోని భవనాలపైనా దృష్టి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేలమట్టం కానున్న వందేళ్ల భవనం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): సెక్రటేరియట్‌ భవనాలను కూల్చివేసి కొత్తవి నిర్మించాలనే పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ క్రమంలో వాటి పరిసర ప్రాంతాల్లోని భవనాలపైనా దృష్టి సారించింది. చుట్టుపక్కల ఉన్న కొన్ని భవనాల వల్ల సెక్రటేరియట్‌కు వాస్తు దోషం ఉందంటూ.. వాటిని నేలమట్టం చేయాలని నిర్ణయుంచింది. ఇందులో భాగంగా తొలుత వందేళ్ల నాటి పురాతన కట్టడం ‘స్టోన్‌ బిల్డింగ్‌’ను తొలగించాలన్న నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్‌ ఔట్‌ గేట్‌ పక్కనే మింట్‌ కాంపౌండ్‌లో ఉన్న ఈ భవనంలో ప్రస్తుతం  టీఎ్‌సఎస్పీడీసీఎల్‌కు సంబంధించిన వివిధ విభాగాల కార్యాలయాలు కొనసాగుతున్నాయి. ఈ భవనాన్ని నిజాం పాలనలో 1910లో పూర్తిగా రాతితో నిర్మించారు.


దక్షిణాసియాలోనే తొలిసారిగా హైదరాబాద్‌ స్టేట్‌లో నిర్మించిన తొలి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ ఈ భవనంలోనే ఉండేది. ఇందులోనే కొన్నేళ్లపాటు ఉస్మానియా టెక్నికల్‌ కాలేజ్‌ కూడా కొనసాగింది. ప్రస్తుతం ఈ విశాలమైన భవనంలో టీఎ్‌సఎస్పీడీసీఎల్‌ సీఈఐజీ (చీఫ్‌ ఎలక్ర్టికల్‌ ఇన్‌స్పెక్టర్‌ టు గవర్నమెంట్‌), మెట్రోజోన్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌, హైదరాబాద్‌ సౌత్‌ ఎస్‌ఈ, బంజారాహిల్స్‌ ఎస్‌ఈ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. అయితే కార్యాలయాలన్నింటినీ వెంటనే ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. సాధ్యమైనంత త్వరలో ప్రత్యామ్నాయాలు చూసుకుని భవనాన్ని ఖాళీ చేయాలంటూ ఆదేశాలు అందినట్లు ఇక్కడి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ఈ భవనంలోని కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.


నిర్మాణం జరిగి.. శతాబ్దం గడిచాక కూడా చెక్కుచెదరకుండా ఉన్న అద్భుతమైన కట్టడాన్ని కూల్చాలనుకోవడం సరికాదని వారు అంటున్నారు. కాగా సెక్రటేరియట్‌ భవనాలను కూల్చివేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటికే పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అయితే సహేతుకమైన కారణాలతో భవనాలను తొలగిస్తున్నామన్న ధీమాలో ఉన్న ప్రభుత్వం.. హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని ఆశిస్తోంది. ఈ మేరకు వాస్తు పనులపై దృష్టి సారించింది. సెక్రటేరియట్‌ లోపలి భవనాల తొలగింపు ప్రక్రియ పూర్తయితే కొత్త భవనాల నిర్మాణమంతా వాస్తు ప్రకారమే జరపాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. 

Updated Date - 2020-02-08T08:30:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising