ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బొగ్గు బావులు బంద్‌ చేయాలి

ABN, First Publish Date - 2020-03-25T10:16:42+05:30

కరోనా విస్తరించకుండా ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించగా.. సింగరేణిలో మాత్రం బొగ్గు ఉత్పత్తి కొనసాగుతోంది. 27 భూగర్భ, 18 ఓపెన్‌కా్‌స్ట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కార్మిక సంఘాల డిమాండ్‌

మంచిర్యాల/ భూపాలపల్లి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): కరోనా విస్తరించకుండా ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించగా.. సింగరేణిలో మాత్రం బొగ్గు ఉత్పత్తి కొనసాగుతోంది. 27 భూగర్భ, 18 ఓపెన్‌కా్‌స్ట గనుల్లో కార్మికులు నిరంతరాయంగా పని చేస్తున్నారు. మంగళవారం 50 శాతం మంది కార్మికులు పనికి వెళ్లారు. తమకు మాస్క్‌లు సరఫరా చేయాలని, గుంపులు గుంపులుగా విధులు నిర్వహించడం సాధ్యంకాదని భూపాలపల్లిలోని కెఎల్‌పీ లాంగ్‌వాల్‌ గని ఎదుట కార్మికులు బైఠాయించారు. కార్మిక సంఘాల నాయకులు భూగర్భ గనులను మూసివేయాలని డిమాండ్‌ చేశారు.


కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్‌కుమార్‌ జైన్‌ సింగరేణి సహా కోల్‌ ఇండియా, దాని అనుబంధ సంస్థలను లాక్‌డౌన్‌ పరిధిలోకి తేవద్దని, బొగ్గు అవసరం దృష్ట్యా గనులను నడపాలని యాజమాన్యాలకు లేఖ రాశారు. దీనిని కార్మిక సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. భూగర్భ గనులను బంద్‌ చేయాలని టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావు సంస్థ సీఎండీకి లేఖ రాశారు. భూగర్భ గనులను బంద్‌ చేయాలని ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్‌ప్రసాద్‌, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి మంద నర్సింహారావు తదితరులు డిమాండ్‌ చేశారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఓపెన్‌కా్‌స్టలను నడిపించాలని సూచించారు.

Updated Date - 2020-03-25T10:16:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising