ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌ వరాల వెనుక వ్యూహం ఏమిటి?

ABN, First Publish Date - 2020-12-30T17:48:26+05:30

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. జీతాల పెంపు, అలాగే పదవి విరమణ వయసుకు సంబంధించి చాలా కాలంగా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. గడచిన ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల హామీ కూడా ఇచ్చింది. ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా సందర్భాల్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. జనవరి మొదటి వారంలో దానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించబోతున్నట్లు ముఖ్యమంత్రి నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకటి, రెండు నెలల్లో ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు.


అలాగే ఎల్ఆర్ఎస్‌కు సంబంధించి ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లపై ఉన్న బ్యాన్‌ను ఎత్తివేశారు. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేసుకోడానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్‌తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. మరోవైపు పంటకొనుగోలు కేంద్రాలను ఎత్తివేయడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా తీసుకున్న నిర్ణయాలు, ఉద్యోగులపై వరాల జల్లు వెనక వ్యూహం ఏంటనే అంశాలపై పలువురు తమ.. తమ అభిప్రాయాలను వెల్లడించారు. పై వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2020-12-30T17:48:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising