ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏప్రిల్‌ 7 నాటికి తగ్గిపోయే అవకాశం: సీఎం కేసీఆర్

ABN, First Publish Date - 2020-03-30T02:10:36+05:30

తెలంగాణ రాష్ట్రంలో 25,937 మందిని కరోనా అనుమానితులగా భావించి.. పరిశీలనలో ఉంచామని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 25,937 మందిని కరోనా అనుమానితులగా భావించి.. పరిశీలనలో ఉంచామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. క్వారంటైన్‌లో ఉన్నవారిని 5,746 టీమ్‌లు అబ్జర్వేషన్‌ చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఏప్రిల్‌ 7 కల్లా 25,937 మంది పరిశీలన సమయం అయిపోతుందని, పాజిటివ్‌ వచ్చిన వారికి ఏప్రిల్‌ 7 నాటికి తగ్గిపోయే అవకాశం ఉందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. కొత్త కేసులు రావొద్దని కోరుకుందామని, భారత్‌లో సరైన వైద్య సదుపాయాలు లేవని కేసీఆర్‌ అన్నారు.


వ్యాధిని వ్యాపించకుండా కాపాడుకోవడమే భారత్‌ ఏకైక ఆయుధమని, స్వీయ నియంత్రణ వల్లే కరోనాను అరికట్టవచ్చని సీఎం స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ను పాటించాలని, వైద్యులు, పోలీస్‌ అధికారులకు సహకరించాలని ఆయన తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. సౌత్‌ కొరియాలో ఒకరి వల్ల 59 వేల మందికి కరోనా వచ్చిందని కేసీఆర్ గుర్తుచేశారు. హోంక్వారంటైన్‌లో ఉన్న వాళ్లను రోజుకు రెండుసార్లు పర్యవేక్షిస్తున్నామని ఆయన వెల్లడించారు.

Updated Date - 2020-03-30T02:10:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising