ప్రగతి భవన్‌లో నేడు కేసీఆర్ కీలక సమావేశం
ABN, First Publish Date - 2020-11-15T12:44:33+05:30
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో
హైదరబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో కీలక సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో భాగంగా వ‌్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై సమీక్షించి ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి సీఎస్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ధరణి’ పోర్టల్ ద్వారా వ్యవయసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని కేసీఆర్ సర్కార్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.
రెండు నెలలుగా నిలిచిపోయిన వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ఆగిపోయాయి. ఇవాళ జరగనున్న ఈ సమావేశంలో వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్లు ప్రారంభించడానికి ఏం చేయాలి..? అనే అంశంపై అధికారులతో కేసీఆర్ చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే.. రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ను కలిసిన ఇదివరకే రిజిస్ట్రేషన్, స్టాంపుల విభాగం అధికారుల సంఘాలు కలిశాయి. ‘ధరణి’ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు అంతా సిద్ధంగా ఉందని.. మెరుగైన సేవలకు పూర్తి స్థాయిలో సహకరిస్తామన్న అధికారులు, సిబ్బంది వెల్లడించారు.
Updated Date - 2020-11-15T12:44:33+05:30 IST