కేసీఆర్‌తో తమిళ మంత్రుల భేటీ.. జగన్‌కు సీఎం ఫోన్..
ABN, First Publish Date - 2020-03-06T02:36:44+05:30
తెలంగాణ సీఎం కేసీఆర్‌తో తమిళనాడు మంత్రుల బృందం సమావేశమైంది.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌తో తమిళనాడు మంత్రుల బృందం సమావేశమైంది. తమిళనాడుకు తాగునీరు విడుదలకు సహకరించాలని కేసీఆర్‌ను మంత్రులు విజ్ఞప్తి చేశారు. తమిళనాడుకు నీరు విడుదలకు కేసీఆర్ సూచనలు చేశారు. ఏపీ, తెలంగాణకు తమిళనాడు సీఎం లేఖ రాయాలని కేసీఆర్ సూచించారు. మూడు రాష్ట్రాల అధికారులు సమావేశమై నిర్ణయం తీసుకుంటారని సీఎం తెలిపారు. తమిళనాడుకు నీరు కొరత ఏర్పడటం దేశం సిగ్గుపడాల్సిన విషయమని, దేశంలో ప్రతి ఏటా 70 వేల టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని, వ్యవసాయానికి 40 వేల టీఎంసీలు వాడుకున్నా మిగిలిన నీటితో తాగునీటి సమస్య తీరుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తమిళనాడు మంత్రుల సమక్షంలోనే ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్ మాట్లాడారు. తమిళనాడు ఇబ్బందులను జగన్‌కు సీఎం కేసీఆర్ వివరించారు.
Updated Date - 2020-03-06T02:36:44+05:30 IST