ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌ కనిపించడం లేదు

ABN, First Publish Date - 2020-07-09T11:11:16+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్‌ 12 రోజులుగా కనిపించడం లేదు. ఆయన ఆచూకీ తెలియచేయాలని కోరుతూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పోలీస్‌ స్టేషన్‌లో కాంగ్రెస్‌ నాయకుల ఫిర్యాదు


వరంగల్‌ సిటీ, జూలై 8: ముఖ్యమంత్రి కేసీఆర్‌ 12 రోజులుగా కనిపించడం లేదు. ఆయన ఆచూకీ తెలియచేయాలని కోరుతూ  గ్రేటర్‌ వరంగల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్‌  బుధవారం  హన్మకొండ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హన్మకొండ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌కు ఫిర్యాదు అందచేశారు. అనంతరం కట్ల శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ కనిపించకపోవడంతో రాష్ట్ర ప్రజలు ఆందోళనతో ఉన్నారన్నారు. ఆయన ఆరోగ్య బాగోగులు తెలియచేయాలని కోరారు. సీఎం కాబట్టి ఆయన సేవలు రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు.  కేసీఆర్‌ కుమారుడు మంత్రి కేటీఆర్‌, కూతురు మాజీ ఎంపీ కవితకు కూడా రాష్ట్రంపై పట్టింపు లేదని ఆరోపించారు.


బంగారు తెలంగాణ సాధన, నిరుద్యోగ భృతి ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయనే ఆందోళన రాష్ట్రంలో నెలకొందన్నారు. ఈ తరుణంలో రాష్ట్ర డీజీపీ, చీఫ్‌ సెక్రెటరీలు జోక్యం చేసుకొని సీఎం కేసీఆర్‌ ఆచూకీ తెలియచేయాలని కోరారు.   ఈ కార్యక్రమంలో ఆశం కల్యాణ్‌, సంధుపట్ల ధన్‌రాజ్‌, రేపల్లే రంగనాథ్‌, బొట్ల ప్రసాద్‌, రాజేష్‌, దయాకర్‌, సురేందర్‌, కుమారస్వామి, బోడ కిషన్‌నాయక్‌, వంశీక్రిష్ణ, కట్ల భరద్వాజ్‌, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-09T11:11:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising