కరోనా నియంత్రణపై సీఎం కేసీఆర్ సమీక్ష
ABN, First Publish Date - 2020-04-26T22:18:05+05:30
కరోనా నియంత్రణపై సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్: ప్రగతిభవన్‌లో కరోనా వైరస్ నియంత్రణపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షాసమావేశానికి మంత్రి ఈటల, సీఎస్ సోమేశ్‌కుమార్ హాజరయ్యారు. సోమవారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న నేపథ్యంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది.
Updated Date - 2020-04-26T22:18:05+05:30 IST