సీఎం కేసీఆర్‌పై అక్బర్ ప్రశంసల జల్లు
ABN, First Publish Date - 2020-03-16T18:15:32+05:30
సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ దేశాన్ని బలహీనపరుస్తున్నాయని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ దేశాన్ని బలహీనపరుస్తున్నాయని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. సీఏఏ కేవలం ముస్లింలకే కాదని... దేశంలోని పేదలందరికీ వ్యతిరేకమన్నారు. తాను ఈ దేశవాసినని.. దేశం కోసం ప్రాణమివ్వడానికైనా సిద్ధమని పేర్కొన్నారు. సీఏఏకు వ్యతిరేక తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ ప్రవేశపెట్టిన తీర్మానం దేశానికి ఆదర్శమన్నారు. సీఎం కేసీఆర్ ప్రయత్నాన్ని అభినందించారు. సీఏఏకి వ్యతిరేకంగా తీర్మాణం చేసిన ఎనిమిదో రాష్ట్రం తెలంగాణ అన్న ఆయన.. ఓ గొప్ప సందేశాన్ని ఇక్కడి నుంచి దేశమంతా తీసుకెళుతున్నారు. తెలంగాణలో అందరినీ ఒకేలా చూస్తారని.. కేసీఆర్ ప్రవేశ పెట్టిన తీర్మానంతో తమ హృదయాలు పులకిస్తున్నాయన్నారు. అందరినీ కలుపుకుపోయే వ్యక్తి కేసీఆర్ అన్నారు. కేసీఆర్‌కు తామెందుకు మద్దతు పలుకుతున్నామో.. ఇవాళ అందరికీ తెలుస్తుందన్నారు. ఎవరైనా సరే.. అందరూ ఈ నేలపై ఒక్కటేనన్నారు.
Updated Date - 2020-03-16T18:15:32+05:30 IST