ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2.4 లక్షల ఇళ్లు ఇప్పటికే ఇచ్చుండాలి

ABN, First Publish Date - 2020-09-23T09:24:44+05:30

‘‘ప్రతి అర్బన్‌ నియోజకవర్గానికీ పది వేల చొప్పున రెండు పడకగదుల ఇళ్లు నిర్మించి ఇస్తామంటూ సీఎం కేసీఆర్‌ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీహెచ్‌ఎంసీలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపై సర్కారువి దొంగ లెక్కలు: భట్టి


హైదరాబాద్‌, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రతి అర్బన్‌ నియోజకవర్గానికీ పది వేల చొప్పున రెండు పడకగదుల ఇళ్లు నిర్మించి ఇస్తామంటూ సీఎం కేసీఆర్‌ గతంలోనే హామీ ఇచ్చారు. దాని ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 శాసనసభ నియోజకవర్గాల్లో 2016-17 ఆర్థిక సంవత్సరం నాటికి 2.4 లక్షల ఇళ్లు నిర్మించి ఇప్పటి కే ఇచ్చుండాలి’’ అని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క అన్నారు. అన్ని ఇళ్లు కాకున్నా.. లక్ష ఇళ్లు ఉన్నాయని చెబుతున్నారని, అవీ దొంగ లెక్కలే చెబుతున్నారని ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో భట్టి విక్రమార్క మాట్లాడా రు.


నాంపల్లిలో 1824 ఇళ్లు, జూబ్లీహిల్స్‌లో 226 ఇళ్లు కట్టినట్లుగా జాబితా ఇచ్చారని, కానీ తనకున్న సమాచారం ప్రకారం అక్కడ ఇళ్లు ఇంకా పూర్తి చేయలేదన్నారు. అనంతరం ఆ యా ఇళ్లను సందర్శించేందుకు వీహెచ్‌, అంజన్‌కుమార్‌యాదవ్‌తో కలిసి నాంపల్లి ని యోజకవర్గం మల్లేపల్లి డివిజన్‌ పరిధిలోని మాన్గార్‌ బస్తీకి వెళ్లారు. 1824 డబుల్‌ బె డ్రూం ఇళ్లు కట్టినట్లు సర్కారు జాబితా ఇవ్వగా.. దాని ప్రకారం ఆ ప్రాంతంలో శంకుస్థాపన రాయి కోసం వెదికారు. 2015లో మంత్రులు తలసాని శ్రీనివాస్‌, కేటీఆర్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి కలిసి శంకుస్థాపన చేసిన రాయి సైతం కనిపించకపోవడంతో విస్మయం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-09-23T09:24:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising