ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సే గుడ్ బై టు ఓల్డ్ ఇయర్ అండ్ స్మోకింగ్

ABN, First Publish Date - 2020-12-30T23:54:45+05:30

సే నో టు టుబాకో అని సామాజిక మాధ్యమాల ద్వారా యావత్ ప్రపంచాన్ని కోరుతూ.. పొగాకు మహమ్మారి మీద పోరు చేయాలని జన బాహుళ్యాన్ని అభ్యర్థించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సే నో టు టుబాకో అని సామాజిక మాధ్యమాల ద్వారా యావత్ ప్రపంచాన్ని కోరుతూ.. పొగాకు మహమ్మారి మీద పోరు చేయాలని జన బాహుళ్యాన్ని అభ్యర్థించారు తెలంగాణ పద్మశాలి అఫిషియల్స్ , ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన  రఘునందన్. కొత్త సంవత్సరం మరో రెండు రోజుల్లో రానుంది. పాత వత్సరం 2020 మరి కొన్ని గంటల్లో గుడ్ బై చెప్ప నుండగా.. తెలుగు వారి  వాడిని,  తెలంగాణా వేడిని భారత ఉపఖండం దాటించి, ఖండాతరల్లో  హైదరాబాద్ ఖ్యాతిని ఒక్క మాటతో  విస్తరిస్తున్నారు  మాచన రఘునందన్. 


టుబాకో కంట్రోల్ అన్న  ఒకే ఒక్క నినాదం తో 2020 మంది ట్విట్టర్ ఖాతా దారులను నో స్మోకింగ్ ప్లీజ్ ..అని  కోరుతున్నారు .   అమెరికా, ఆఫ్రికా దేశాల వారు  ఎందరో  తన బాటను మాటను అనుసరించేలా  చేస్తున్నారు. పౌరసరఫరాలశాఖ లో ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ గా మహబూబ్ నగర్ జిల్లా నారాయణ పేట లో పని చేస్తున్నారు. ఒక అధికారిగా జనం ఎంతగా గుర్తించినా అంతకు మూడు రెట్లు గుర్తింపును తన అసాధారణ, అసామాన్య సామాజిక స్పృహ గలిగిన  ఆలోచనా సరళి తో అంతర్జాతీయ గుర్తింపుకు నోచుకున్నారు.


పొగాకు నియంత్రణ, ధూమపానం కు వ్యతిరేకంగా నినదిస్తున్నారు.  విధి నిర్వహణలో ఎంతటి అంకిత భావం ప్రదర్శిస్తారో.. సమాజ సేవకూ ప్రాధాన్యం ఇస్తారు.  ప్రజలే దేవుళ్ళు గా పరిగణిస్తారు. ఇది ఈ అధికారి జీవితంలో ఒక పార్శ్వం కాగా .. మానవ సేవే మాధవ సేవ అని భావించే ఈ అధికారి జన హితం కో రుతూ... ఆత్మీయత తో ఆదరించే అరుదైన అధికారిగా  పేరు తెచ్చుకున్నారు. 


రెండు దశాబ్దాలుగా పొగాకు, ధూమపానం కు వ్యతిరేకంగా ఒంటరి పోరాటం చేస్తున్నారు. కేవలం తెలంగాణా కే పరిమితం కాకుండా, భారత దేశ వ్యాప్తంగా పొగాకు, ధూమపానం అలవాటు వల్ల కలిగే పర్యవసానాలను చక్కగా జన బాహుళ్యానికి వివరిస్తున్నారు. ఈ విధానం తోనే ప్రపంచ వ్యాప్తంగా పొగాకు ప్రమాదాలపై జగతిని జాగృతం చేస్తున్నారు. 

Updated Date - 2020-12-30T23:54:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising