ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కలను రక్షించుకునే బాధ్యత ప్రజాప్రతినిధులదే: చల్లా

ABN, First Publish Date - 2020-06-30T11:45:00+05:30

నాటిన మొక్కలను రక్షించుకునే బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని ఎమ్మెల్యే చల్లా ధర్మారె డ్డి అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరు, జూన్‌ 29: నాటిన మొక్కలను రక్షించుకునే బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం అక్కంపేట, లింగమడుగుపల్లి గ్రామాల్లో హరితహారంలో భాగంగా మొక్కను నాటారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చెట్లను నరికి తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్క సుమలత, జడ్పీటీసీ కక్కెర్ల రాధిక, ఆత్మకూరు మార్కెట్‌ చైర్మన్‌ కాంతాల కేశవరెడ్డి, అక్కంపేట, లింగమడుగుపల్లి సర్పంచ్‌లు ఎన్కతాళ్ల విజయ, జిల్లపెల్లి రమ, ఎంపీడీవో నర్మద, ఏపీవో రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


మహిళలకు జీవనోపాధి పెంచేందుకే రుణాలు

పరకాల:  సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్వోదయ కార్యదర్శి పల్లేపాడు దామోదర్‌ ఆధ్వర్యంలో బాధిత మహిళల జీవనోపాధికై రుణాలు చెక్కులు ఎమ్మెల్యే చేతుల మీదుగా పరకాల, నడికూడ మండలాల్లోని పలుగ్రామాలకు చెందిన 25 మంది లబ్ధిదారులకు  అందజేశారు. 


రోడ్డు పనుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

గీసుగొండ: లేబర్‌కాలనీ నుంచి ఏనుమాముల మార్కెట్‌కు వెల్లే వంద ఫీట్ల రోడ్డు పునర్నిర్మాణ పనుల్లో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కమిషనర్‌ పమేలా సత్పతితో కలిసి ఆయన పరిశీలించారు. సంవత్సరకాలంగా రోడ్డు పనులను ఎందుకు నిలిపివేశారని అధికారులపై మండిపడ్డారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ చింతం సదానందం, కార్పొరేటర్‌లు బాలయ్య, లింగం మౌనిక, ఈఈ విద్యాసాగర్‌, డీఈ రవిందర్‌, ఏఈ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-30T11:45:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising