ఆక్సిజన్ సరఫరాపై కేంద్రం మార్గదర్శకాలు
ABN, First Publish Date - 2020-04-05T11:26:48+05:30
కొవిడ్-19 బాధితులకు చికిత్స చేసే ఆస్పత్రులు, వైద్య సంస్థలకు ఆక్సిజన్ సరఫరాపై అన్ని రాష్ట్రాలకూ కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. సదరు ఆస్పత్రుల...
కొవిడ్-19 బాధితులకు చికిత్స చేసే ఆస్పత్రులు, వైద్య సంస్థలకు ఆక్సిజన్ సరఫరాపై అన్ని రాష్ట్రాలకూ కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. సదరు ఆస్పత్రుల సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రాణవాయువు అవసరాలకు సరిపడా విజ్ఞప్తులు, అందిన ఆక్సిజన్‌కు చెల్లింపులు చేసేలా చూడాలని అందులో సూచించింది. తద్వారా ఆక్సిజన్‌కు కొరత లేకుండా చూసుకోవాలని పేర్కొంది. ఫిల్లింగ్ పాయింట్ నుంచి లోడింగ్, రవాణా, అన్‌లోడింగ్, ఆస్పత్రుల్లో వినియోగం.. ఇలా అన్ని దశల్లోనూ ఆక్సిజన్ సిలిండర్లను డిస్‌ఇన్ఫెక్ట్ చేసే విధానాలను సూచించింది.
Updated Date - 2020-04-05T11:26:48+05:30 IST