ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం

ABN, First Publish Date - 2020-10-22T08:01:14+05:30

తెలంగాణలో భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించి, అంచనా వేయడానికి గాను గురువారం నుంచి కేంద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

తెలంగాణలో భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించి, అంచనా వేయడానికి గాను గురువారం నుంచి కేంద్ర బృందం గురువారం రాష్ట్రానికి రానుంది. జాయింట్‌ సెక్రటరీ ప్రవీణ్‌ వశిష్ఠ నేతృత్వంలోని ఆర్‌.బి.కౌల్‌(కేంద్ర అటవీ శాఖ), కె.మనోహరన్‌( వ్యవసాయ శాఖ), ఎస్‌.కె.కుశ్వాహా(రోడ్లు భవనాలు, హైవేలు)తో పాటు జలశక్తి శాఖకు చెందిన ప్రతినిధుల బృందం గురువారం ఉదయం రాష్ట్రానికి చేరిన అనంతరం, అధికారులతో సమావేశమవుతుంది.


రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రాంతాల్లో పర్యటించనుంది. రెండురోజుల పర్యటన అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డితో కూడా హైదరాబాద్‌లోనే ఈ బృందం సమావేశం కానుంది. ఆ తర్వాత కేంద్రానికి నివేదిక అందించనుంది.


Updated Date - 2020-10-22T08:01:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising