ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌హెచ్‌డిసి హోదాలో ఎలాంటి మార్పులు చేయం- కేంద్ర మంత్రి స్మృతిఇరానీ

ABN, First Publish Date - 2020-08-15T22:13:20+05:30

నగరంలో జాతీయ చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌హెచ్‌డిసి) కార్యాలయంలో కొన్నిదశాబ్ధాలుగా ప్రజలకు విశేష సేవలు అందిస్తోందని, దాని ప్రాంతీయ హోదాలో ఎటువంటి మార్పులు చేయకుండా యథాతథస్థితిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: నగరంలో జాతీయ చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌హెచ్‌డిసి) కార్యాలయంలో కొన్నిదశాబ్ధాలుగా ప్రజలకు విశేష సేవలు అందిస్తోందని, దాని ప్రాంతీయ హోదాలో ఎటువంటి మార్పులు చేయకుండా యథాతథస్థితిని కొనసాగిస్తామని కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి జుబిన్‌ ఇరానీ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు, కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి హామీ ఇచ్చారు. ఎన్‌హెచ్‌డిసి కార్యాల హోదా తగ్గించి మరొక ప్రాంత కార్యాలయానికి ఉప కార్యాలయంగా చేయడం వల్ల తెలంగాణ చేనేతరంగ సమాజంలో ఆందోళన నెలకొందని, దీని వల్ల ఇక్కడి చేనేత రంగ కార్యకలాపాల మీద వ్యతిరేక ప్రభావం చూపి, ఆర్ధికంగా నష్టదాయకం అవుతుందని కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు పోయారు. 


తెలంగాణ చేనేత సమాజ ప్రయోజనాల పరిరక్షణకు తక్షణమే కార్యాలయ యధాతథ స్థితిని కొనసాగించాలని కిషన్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. కిషన్‌రెడ్డి చేసిన సూచనను పరిగణలోకి తీసుకుని సానుకూలంగా స్పందించిన కేంద్ర జౌళి శాఖ మంత్రి హైదరాబాద్‌ కార్యాలయం ప్రాంతీయ కార్యాలయంగా సేవలందిస్తుందని హామీ ఇచ్చారు.

Updated Date - 2020-08-15T22:13:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising