ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశానికి ‘గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌’ అవసరం- కేంద్ర మంత్రి పురుషోత్తం

ABN, First Publish Date - 2020-09-19T01:06:55+05:30

ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాలు ఇప్పుడు పర్యావరణ రక్షణ అని కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి పురుషోత్తం రూపాల అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాలు ఇప్పుడు పర్యావరణ రక్షణ అని కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని అశోక మొక్క నాటారు. ఈ కార్యక్రమాన్నిచేపట్టిన తెలంగాణకు చెందిన ఎంపీ సంతోష్‌కుమార్‌ను ఆయన మనస్పూర్తిగా అభినందించారు. యువకుడైన ఓక ఎంపీ పర్యావరణ హితమైన కార్యక్రమాన్ని చేపట్టి దేశ వ్యాప్తం చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు.


గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ విజయవంతం అయ్యేందుకు అవసరమైన శక్తిని ఆ భగవంతుడు సంతోష్‌కుమార్‌కు ఇవ్వాలని ఆశీర్వదించారు. తన సహచర కేంద్ర మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేస్తానని ఈసందర్భంగా మంత్రి రూపాల హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలునాటుతున్న ప్రతి ఒక్కరూ వాటి రక్షణ బాధ్యతలు కూడా తీసుకోవాలని సూచించారు. 

Updated Date - 2020-09-19T01:06:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising