జిల్లాల్లో ‘ప్రజావాణి’ రద్దు
ABN, First Publish Date - 2020-03-16T08:52:50+05:30
కరోనాను ప్రభుత్వం విపత్తుగా గుర్తించడంతో.. జిల్లా కలెక్టర్లు ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమం రద్దయింది. వైరస్ వ్యాప్తి చెందకుండా
హైదరాబాద్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): కరోనాను ప్రభుత్వం విపత్తుగా గుర్తించడంతో.. జిల్లా కలెక్టర్లు ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమం రద్దయింది. వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకునే చర్యల్లో భాగంగా దీనిని రద్దు చేశారు. ప్రజల విజ్ఞప్తుల పరిష్కారం కోసం నిర్వహించే ఈ కార్యక్రమానికి సగటున 100 నుంచి 200 మంది దాకా హాజరవుతుంటారు. అయితే ఒకే చోట ఇంతమంది గుమిగూడటం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్న నేపథ్యంలో ఈ నెలాఖరు దాకా ప్రజావాణి నిర్వహించరాదని కలెక్టర్లు నిర్ణయించారు.
దీనికి బదులుగా రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రజలు విడివిడిగా కలిసి.. విజ్ఙప్తులు సమర్పించే అవకాశం కల్పించారు. కరోనా వైరస్ నేపథ్యంలో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తే విపత్తుల యాజమాన్య చట్టం-2005లోని సెక్షన్ -54ను అనుసరించి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు సీఎస్ సోమే్‌షకుమార్ జీవోనెం.4ను జారీ చేశారు.
Updated Date - 2020-03-16T08:52:50+05:30 IST