ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్‌ బాధితుల కోసం కాల్‌సెంటర్‌ ఏర్పాటు

ABN, First Publish Date - 2020-07-11T00:05:50+05:30

కోవిడ్‌తో ప్రపంచ వ్యాప్తంగా పోరాడుతున్నవేళ తెలంగాణ ప్రభుత్వం కోవిడ్‌కష్టకాలంలో ప్రజలను ఎప్పటిప్పుడు చైతన్య వంతులను చేసేందుకు అలుపెరగని పోరాటం చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కోవిడ్‌తో ప్రపంచ వ్యాప్తంగా పోరాడుతున్నవేళ తెలంగాణ ప్రభుత్వం కోవిడ్‌కష్టకాలంలో ప్రజలను ఎప్పటిప్పుడు చైతన్య వంతులను చేసేందుకు అలుపెరగని పోరాటం చేస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్‌కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోంది. ఈ కాల్‌సెంటర్‌ ద్వారా కోవిడ్‌పాజిటివ్‌ వచ్చిన రోగులకు ఇంటి వద్దనే ఉంటూ హోం ఐసోలేషన్‌లో భాగంగా తీసుకోవాల్సిన చర్యలు గురించి కౌన్సిలింగ్‌ ఇస్తుంది. సాధారణ పరిస్థితుల్లో రోజువారీగా 17 రోజుల పాటు కాల్‌సెంటర్‌ నుంచి నిపుణులతో ఫాలోఅప్‌చేస్తున్నారు. మైల్డ్‌ లక్షణాలు ఉన్నవారికీ టెలిమెడిసిన్‌కన్సల్టేషన్‌ద్వారా వైద్య సలహాలు అందిస్తున్నారు. కాల్‌సెంటర్‌ సిబ్బంది రెండు విడతల్లో సుమారు 200 మంది కాలర్స్‌తో నిరంతరాయంగా పనిచేస్తుంది. 


హోం ఐసోలేషన్‌లో ఉన్న సుమారు పది వేల మంది కోవిడ్‌బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,సమతుల ఆహారం, వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడమే కాకుండా సలహాలు, సూచనలు చేస్తున్నారు. ప్రతి రోజూ సుమారు ఐదు వందల మంది రోగులకు ప్రాధాన్యత క్రమంగా టెలిమెడిసిన్‌ ద్వారా వైద్య సలహాలు అందజేస్తున్నారు. కోవిడ్‌ బాధితులు తీవ్రమైన శ్వాస సంబంధ సమస్య లేదా ఛాతినొప్పితో బాధపడుతుంటే వారి వివరాలను సేకరించి వెంటనే 108 ద్వారా మెరుగౌన వైద్య సౌకర్యంకల్పించేందుకు ఆసుపత్రికి తరలించడం జరుగుతుంది.


కాల్‌సెంటర్‌ టోల్‌ ఫ్రీనెం. 18005994455కుహోం ఐసోలేషన్‌లో ఉన్నరోగితోపాటు రోగికి సేవలు అందించే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేస్తారు. కోవిడ్‌కు సంబంధించి ఏమైనా సూచనలు, సలహాలు తెలుసుకోవాలనుకునే వారు కోవిడ్‌ కాల్‌సెంటర్‌కు కాల్‌చేసి తమ సందేహాలను నివృత్తిచేసుకోవచ్చని అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-07-11T00:05:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising