ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండెపోటుతో కారులోనే వ్యాపారి మృతి

ABN, First Publish Date - 2020-12-11T12:16:13+05:30

తెల్లవారుజామున కారులోనే ఓ వ్యాపారి మృతిచెందిన ఘటన కలకలం రేపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • హైదరాబాద్‌ వెళ్తుండగా బోధన్‌లో ఘటన
  • మృతుడు పార్సీగుట్టవాసిగా గుర్తింపు

హైదరాబాద్/బోధన్‌ : నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో గురువారం తెల్లవారుజామున కారులోనే ఓ వ్యాపారి మృతిచెందిన ఘటన కలకలం రేపింది. హైదరాబాద్‌లోని పార్సీగుట్టకు చెందిన శ్రీనివా్‌సగౌడ్‌ మహారాష్ట్రలో వ్యాపారం చేస్తున్నాడు. అక్కడ ఆయనకు వ్యాపార లావాదేవీలు ఉండడంతో.. తరచూ వెళ్లి వస్తుంటాడు. గురువారం తెల్లవారుజామున సైతం మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు సొంత ఇన్నోవా వాహనంలో వెళ్తుండగా.. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో కారును పక్కకు ఆపి అక్కడే ఉండిపోయాడు. కారులోనే గుండెపోటు తీవ్రత పెరగడంతో ప్రాణాలు కోల్పోయాడని పట్టణ సీఐ రామన్‌ తెలిపారు. కారులో రూ.5లక్షల వరకు నగదు, ఇతర పత్రాలు లభించడంతో కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. గుండెపోటుతోనే కారులో మృతిచెందాడని, ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులు తెలిపారు. కారులోని నగదు, ఇతర పత్రాలు కుటుంబసభ్యులకు అప్పగించారు.

Updated Date - 2020-12-11T12:16:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising