ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బండి సంజయ్‌ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు: భట్టి

ABN, First Publish Date - 2020-11-28T07:31:30+05:30

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని సీఎల్పీనేత భట్టి విక్రమార్క

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సర్జికల్‌ దాడి వ్యాఖ్య హాస్యాస్పదం: భట్టి

బౌద్ధనగర్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని సీఎల్పీనేత భట్టి విక్రమార్క విమర్శించారు. అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. బండి సంజయ్‌ సర్జికల్‌ దాడి  అంటూ ప్రకటన చేయటం హాస్యాస్పదమని భట్టి అన్నారు. ఆ పదాన్ని డిఫెన్స్‌కు సంబంధించిన వారుమాత్రమే వాడతారని తెలిపారు.


శుక్రవారం సీతాఫల్‌మండి, మెట్టుగూడ డివిజన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులు నాగులూరి ఇందుమతిగౌడ్‌, ఎలిజిబిత్‌లకు మద్దతుగా నామాలగుండు, సీతాఫల్‌మండి, చిలకలగూడ, హమాలీబస్తీ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రధాన సమస్యలను పక్కదోవ పట్టించటానికి బీజేపీ, టీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు మతోన్మాదమనే ఆయుధాన్ని తెరపైకి తీసుకువచ్చాయన్నారు. దీంతో కరోనా, వైద్య, పింఛన్లు, లక్షబెడ్‌రూమ్‌ ఇండ్లు, వరదబాధితుల సమస్యలు పక్కదోవ పట్టాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. 


Updated Date - 2020-11-28T07:31:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising