ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌లో బోనాల పండుగను ఇళ్లలోనే జరుపుకోవాలి: సీపీ

ABN, First Publish Date - 2020-07-08T22:02:01+05:30

హైదరాబాద్‌లో బోనాల పండుగను ఇళ్లలోనే జరుపుకోవాలని సీపీ అంజనీకుమార్ సూచించారు. ఎవరూ కూడా బోనాలతో దేవాలయాలకు రావొద్దన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: హైదరాబాద్‌లో బోనాల పండుగను ఇళ్లలోనే జరుపుకోవాలని సీపీ అంజనీకుమార్ సూచించారు. ఎవరూ కూడా బోనాలతో దేవాలయాలకు రావొద్దన్నారు. ఈసారి గోల్కొండ, సికింద్రాబాద్ మహంకాళి.. లాల్ దర్వాజ దేవాలయాల్లో బోనాల సమర్పణ లేదని సీపీ తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు జూన్ 25న ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోనే ముందుగా బోనాల ఉత్సవాలు ఇక్కడే మొదలై చివరగా ఇక్కడే ముగుస్తాయి. కరోనా నేపథ్యంలో గతంలో మాదిరిగా కాకుండా పరిమిత సంఖ్యలో భక్తుల్ని అమ్మవారి ఆలయాలకు అనుమతించాలని అధికారులు ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండగగా ప్రకటించింది. ప్రతి ఏడాది బోనాల జాతర నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. ఈ సారి కరోనా కారణంగా నిధులు విడుదల చేయలేదు. 

Updated Date - 2020-07-08T22:02:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising