ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ కత్తులు దూసుకున్న కారు, కమలం.. వరంగల్‌లో హై టెన్షన్

ABN, First Publish Date - 2020-07-13T15:43:52+05:30

వరంగల్: హన్మకొండలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోటాపోటీ నిరసనలపై ఉద్రిక్తత కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: కారు, కమలం మళ్లీ కత్తులు దూసుకున్నాయి. వరంగల్‌లోని హంటర్ రోడ్‌లో ఆదివారం ఇరు వర్గాల మధ్య ప్రారంభమైన ఘర్షణ సోమవారం ఉదయం కూడా కొనసాగింది.  హన్మకొండలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోటాపోటీ నిరసనలపై ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఇళ్ల వద్ద పోలీస్ పహారాను అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు బీజేపీ కార్యాలయం వద్ద పోలీసుల భద్రతను పెంచారు. ఇరు పార్టీల కార్యకర్తలపై సుబేదారి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.


బీజేపీ అర్బన్ జిల్లా పార్టీ కార్యాలయం ముందు ఆందోళన కొనసాగుతోంది. ఎంపీ కారును అడ్డుకున్న ఐదుగురు టీఆర్ఎస్‌వీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోటాపోటీగా నిరసన చేసిన బీజేపీ కార్యకర్తలపై సుబేదారి పీఎస్‌లో మరో కేసు నమోదైంది. తమపై అరవింద్ చేసిన ఆరోపణలు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని నన్నపునేని నరేందర్ ప్రకటించారు. లేకపోతే ఎంపీ అరవింద్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2020-07-13T15:43:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising