ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ పెండింగ్‌ జిల్లా కమిటీలు త్వరలో ఖరారు!

ABN, First Publish Date - 2020-07-18T08:20:02+05:30

బీజేపీ పెండింగ్‌ జిల్లా కమిటీలు త్వరలో ఖరారు!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న బీజేపీ జిల్లా కమిటీల నియామకాల ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. ఒకటి, రెండు మినహా మిగతా జిల్లాలకు సంబంధించి అభిప్రాయసేకరణ పూర్తయ్యింది. సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఏడాది కిందటే జిల్లా కమిటీల నియామకాలు జరగాల్సి ఉంది. అయితే, పలు ఉమ్మడి జిల్లాల పరిధిలోని మండల కమిటీలు ఏర్పాటు కాకపోవడంతోపాటు అసెంబ్లీ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికలు, లాక్‌డౌన్‌ నేపథ్యంలో పెండింగ్‌లో పడిపోయాయి. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా బండి సంజయ్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత సిరిసిల్ల, మెదక్‌, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌, వనపర్తి, మహబూబాబాద్‌, ములుగు జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించారు. అంతకుముందు, రాష్ట్రపార్టీ అధ్యక్షుడుగా ఉన్న లక్ష్మణ్‌ ఇదివరకే 19 జిల్లాలకు అధ్యక్షులను ఖరారు చేశారు. మరోవైపు, హైదరాబాద్‌ నగరాన్ని సంస్థాగతంగా 4 జిల్లాలుగా నాయకత్వం విభజించింది. మొత్తం 36 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులను నియమించాల్సి ఉండగా, ఇప్పటివరకు 26 జిల్లాలకు ఖరారు చేసింది.

Updated Date - 2020-07-18T08:20:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising