ఎర్ర శేఖర్ రాజీనామా ఉపసంహరణ
ABN, First Publish Date - 2020-12-21T03:37:50+05:30
జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎర్ర శేఖర్ తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. ఆదివారం ఉదయం ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. స్వయంగా..
మహబూబ్‌నగర్: జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎర్ర శేఖర్ తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. ఆదివారం ఉదయం ఆయన రాజీనామా చేశారు. స్వయంగా మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసిన ఆయన.. రాజీనామా విషయం తెలిపి.. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు. దీంతో ఎర్ర శేఖర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్ చేసి బుజ్జగించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎర్ర శేఖర్ తన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.
Updated Date - 2020-12-21T03:37:50+05:30 IST