ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులకు అండగా బీజేపీ : కీర్తిరెడ్డి

ABN, First Publish Date - 2020-12-14T04:58:25+05:30

ఉద్యోగులకు అండగా బీజేపీ : కీర్తిరెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూపాలపల్లి కలెక్టరేట్‌, డిసెంబరు 13: ప్రభుత్వ ఉద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు. భూపాలపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పాలనలో ఉద్యోగులు, ఉపాధ్యా యులు, పెన్షనర్లు అణచివేతకు గురవుతున్నారని అన్నారు. వారి హక్కులను కాలరాస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండి పడ్డారు. ఉద్యో గులకు ప్రమోషన్లు, బదిలీలు చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్య మంలో నిర్విరామంగా పాల్గొన్న ఉద్యోగులను ముఖ్యమంత్రి కేసీ ఆర్‌ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని సోమవారం కలెక్టరేట్‌ ఎదుట నిర్వ హించనున్న ధర్నాను విజయవంతం చేసి ప్రభుత్వానికి కను విప్పు కలిగించాలన్నారు. విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కన్నం యుగేందర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరకల గణపతి, కార్యాలయ కార్యదర్శి రామకృష్ణ  పాల్గొన్నారు.

Updated Date - 2020-12-14T04:58:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising