ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాజెక్ట్‌లకు బీజేపీ వ్యతిరేకం కాదు: పొంగులేటి

ABN, First Publish Date - 2020-06-01T21:02:29+05:30

ప్రాజెక్ట్‌లకు బీజేపీ వ్యతిరేకం కాదని, బీజేపీపై టీఆర్ఎస్ నేతలు దృష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి దుయ్యబట్టారు. కృష్ణానది నీటి వినియోగంపై బీజేపీ ముఖ్యనేతల సమావేశం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ప్రాజెక్ట్‌లకు బీజేపీ వ్యతిరేకం కాదని, బీజేపీపై టీఆర్ఎస్ నేతలు దృష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి దుయ్యబట్టారు. కృష్ణానది నీటి వినియోగంపై బీజేపీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేతలు సంజయ్‌, డీకే అరుణ, మురళీధరరావు హాజరైనారు. ఈ సమావేశంలో కృష్ణా జలాల సాధన పోరాట కమిటీ ఏర్పాటు చేయాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం సుధాకర్‌‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో కృష్ణాజలాల్లో హక్కు కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు. సీఎం కేసీఆర్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో కేసీఆర్ విఫలమయ్యారని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడుతో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతోందని పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-06-01T21:02:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising