ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే ఎన్నికల్లోనూ ఒంటరిగానే బరిలోకి : బీజేపీ ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్

ABN, First Publish Date - 2020-11-29T18:37:37+05:30

వచ్చే ఎన్నికల్లోనూ తెలంగాణలో ఒంటరిగానే పోటీకి దిగుతామని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్ ప్రకటించారు. అసదుద్దీన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : వచ్చే ఎన్నికల్లోనూ తెలంగాణలో ఒంటరిగానే పోటీకి దిగుతామని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్ ప్రకటించారు. అసదుద్దీన్ లాంటి వారు తెలంగాణ ప్రాంతంలో విషాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తున్నారని, విద్వేష పూరిత రాజకీయాలనే వ్యాపారంగా చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. తొందర్లోనే ఒవైసీల రాజకీయ జీవితం ముగుస్తుందని, ఇప్పటికే ప్రారంభమైపోయిందని అన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీని దుబ్బాక ఎన్నికల్లో ఆశీర్వదించారని, అదో టర్నింగ్ పాయింట్ అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ నేతృత్వం, జేపీ నడ్డా అధ్యక్షతన బీజేపీ దేశవ్యాప్తంగా విస్తరిస్తోందని, అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. ప్రాంతీయ పార్టీల్లో అవినీతి, అభిమానం, బంధుప్రీతి పెరిగిపోయాయని, ఆ పార్టీలన్నీ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని, దేశం కోసం కాదని మండిపడ్డారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నింటికీ బీజేపీ ప్రత్యామ్నాయమని తరుణ్ ఛుగ్ తెలిపారు. 

Updated Date - 2020-11-29T18:37:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising