ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎస్‌సీల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు బంద్‌..!

ABN, First Publish Date - 2020-12-29T08:31:31+05:30

జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ జీహెచ్‌ఎంసీలోని పౌర సేవా కేంద్రాల్లో (సీఎ్‌ససీ) బంద్‌ కానుంది. దరఖాస్తుల స్వీకరణ నుంచి ధ్రువపత్రాల జారీ వరకు మొత్తం ప్రక్రియను సీఎ్‌ససీల్లో నిలిపివేయాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు

మీ-సేవ కేంద్రాల ద్వారానే ధ్రువీకరణ పత్రాలు

కొత్త సాఫ్ట్‌వేర్‌ సిద్ధం.. త్వరలో ట్రయల్‌ రన్‌

సబ్‌రిజిస్ర్టార్‌గా ఏఎంసీ.. రిజిస్ర్టార్‌గా ఏఎంఓహెచ్‌


హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ జీహెచ్‌ఎంసీలోని పౌర సేవా కేంద్రాల్లో (సీఎ్‌ససీ) బంద్‌ కానుంది. దరఖాస్తుల స్వీకరణ నుంచి ధ్రువపత్రాల జారీ వరకు మొత్తం ప్రక్రియను సీఎ్‌ససీల్లో నిలిపివేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. మీ-సేవా కేంద్రాల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సిద్ధం చేశారు. ఒకటి, రెండు రోజుల్లో ట్రయల్‌ రన్‌ నిర్వహించి జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధించి సంస్కరణలతో కూడిన నయా నిబంధనలు కొత్త ఏడాదిలో అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కమిషనర్‌ డీఎస్‌ లోకేష్‌ కుమార్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. ప్రస్తుతం సబ్‌ రిజిస్ర్టార్లుగా ఉన్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది గుర్తింపు రద్దు చేస్తున్నారు. అసిస్టెంట్‌ మునిసిపల్‌ కమిషనర్‌(ఏఎంసీ) సబ్‌ రిజిస్ర్టార్‌గా, అసిస్టెంట్‌ మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్‌(ఏఎంఓహెచ్‌) రిజిస్ట్రార్‌గా వ్యవహరించనున్నారు. నిర్ణీత కాల వ్యవధిలోపు వచ్చే దరఖాస్తులకు సంబంధించి జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే అధికారం వీరిద్దరికి ఉంటుంది. మీ-సేవా కేంద్రాల్లో మాత్రమే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలన్న ప్రతిపాదనను గతంలోనే కౌన్సిల్‌ ఆమోదించింది. దీనికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ సిద్ధమైందని కేంద్ర కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.


సర్కిల్‌ యూనిట్‌గా...

జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధించి జీహెచ్‌ఎంసీలో అవినీతి, అక్రమాలు పెరుగుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా.. క్షేత్రస్థాయిలో అవకతవకలు ఆగడం లేదు. ఉద్యోగులే నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి అరెస్టయిన ఉదంతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వార్డు యూనిట్‌గా ఉన్న జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీ డిసెంబరు 31వ తేదీకి ఆఖరుకానుంది. జనవరి 1 నుంచి సర్కిల్‌ యూనిట్‌గా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వనున్నారు. ఇందుకోసం సర్కిల్‌ స్థాయిలో జనన, మరణ పత్రాల నమోదుకు సంబంధించి ప్రత్యేక రిజిస్టర్లు మెయింటెయిన్‌ చేయాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం వార్డుల వారీగా ఉన్న రిజిస్టర్లను సర్కిళ్లకు పంపాల్సి ఉంటుంది. ఒక్కో సర్కిల్‌లో ఒక సబ్‌-రిజిస్ర్టార్‌, ఒక రిజిస్ర్టార్‌ ఉంటారు.


ఇవీ నిబంధనలు...

  • జననం, మరణం తర్వాత 30 రోజుల్లో వచ్చే దరఖాస్తులకు సంబంధించి ఏఎంసీ (సబ్‌రిజిస్ర్టార్‌) స్థాయిలో ధ్రువపత్రాలు జారీ చేస్తారు.
  • 30 రోజుల తరువాతి నుంచి ఏడాదిలోపు వచ్చే దరఖాస్తులకు సంబంధించి ఏఎంఓహెచ్‌ (రిజిస్ర్టార్‌) స్థాయిలో జనన, మరణ పత్రాలు ఇస్తారు. 
  • ఏడాది తరువాత వచ్చే దరఖాస్తులను స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ర్టేట్‌/రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసర్‌ స్థాయిలో పరిశీలిస్తారు. 
  • మీ-సేవా కేంద్రాల్లో వచ్చిన దరఖాస్తులు మాత్రమే ఏఎంసీ, ఏఎంఓహెచ్‌ లాగిన్‌లకు వెళ్తాయి. సీఎ్‌ససీల్లో దరఖాస్తు చేస్తే ప్రయోజనం ఉండదు. నిర్ణీత రుసుము చెల్లిస్తే పోస్టల్‌ ద్వారా ఇళ్లకూ పత్రాలు పంపే సదుపాయం కల్పిస్తున్నారు. 

Updated Date - 2020-12-29T08:31:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising