ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ ముసుగు నిన్నటితో తొలగిపోయింది: భట్టి

ABN, First Publish Date - 2020-12-29T20:52:16+05:30

సీఎం కేసీఆర్ ముసుగు నిన్నటితో తొలగిపోయిందని సీఎల్పీనేత భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిందంతా డ్రామానే అని సీఎల్పీనేత భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. కేసీఆర్ ముసుగు నిన్నటితో తొలగిపోయిందని పేర్కొన్నారు. రైతు వ్యతిరేక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం బలమైన వ్యవస్థలను కూల్చే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఐకేపీ వ్యవస్థను మూసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. పీఏసీఎస్‌ను మూసేయలని చూస్తున్నారన్నారు. రైతులకు మద్దతు ధర రాకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం ముందు రాజ్యాంగాన్ని చదువుకోవాలని హితవు పలికారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. లాభ నష్టాలు చూసేది అసలు ప్రభుత్వమే కాదన్నారు. గుజరాతి వ్యాపారులకు రైతులను ఫణంగా పెట్టి కేంద్రం బిల్లులు తెచ్చిందని ఆక్షేపించారు.కేసీఆర్ అరాచకాలను ఆపుతామన్నారు. రైతుల పక్షాన పోరాడుతామని సీఎల్పీనేత భట్టివిక్రమార్క తెలిపారు.

Updated Date - 2020-12-29T20:52:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising