భద్రకాళి.. మహిషాసుర మర్దినియైు.. !
ABN, First Publish Date - 2020-10-25T06:53:05+05:30
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన శనివారం అమ్మవార్లు వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు.
ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన శనివారం అమ్మవార్లు వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి, వేములవాడలో శ్రీ రాజరాజేశ్వరీ దేవి మహాగౌరీగా సాక్షాత్కరించారు.
వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారు మహిషాసుర మర్దినిగా, అలంపూర్‌లోని జోగుళాంబ దేవి సిద్ధిధాత్రిగా, భద్రాచలంలోని శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు వీరలక్ష్మిగా, మెదక్ జిల్లా ఏడుపాయలలో వన దుర్గామాత శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా భక్తులను అనుగ్రహించారు.
Updated Date - 2020-10-25T06:53:05+05:30 IST