ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందుకే కేసీఆర్ మౌనం : బండి సంజయ్

ABN, First Publish Date - 2020-08-08T23:31:08+05:30

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నదీ జలాల విషయంలో ఏపీకి సీఎం కేసీఆర్ సహకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. అందుకే పోతిరెడ్డిపాడుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనంగా ఉన్నారని ఆయన ఆరోపించారు. కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదు? అని కేసీఆర్‌ సర్కార్‌ను బండి ప్రశ్నించారు. సీఎం తీరుతో పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు ఎడారిగా మారతాయని బండి జోస్యం చెప్పారు. 


జగన్‌తో ఒప్పందంలో భాగంగానే అఫెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయించారన్నారు. ఏపీ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తోందని.. ఆగస్టు 12లోపు సీఎం కేసీఆర్ అఫెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయించాలని బండి డిమాండ్ చేశారు. నదీ జలాల విషయంలో ప్రభుత్వానికి అన్ని విధాలా బీజేపీ సహకరిస్తోందని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-08-08T23:31:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising