ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా పరీక్షలు చేయడంలో రాష్ట్రం విఫలం: బండి సంజయ్

ABN, First Publish Date - 2020-06-22T17:39:38+05:30

హైదరాబాద్: కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ లో చేర్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ లో చేర్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేంద్రం రాష్ట్రానికి చేసిన సాయంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరోనా పరీక్షలు చేయటంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లక్షల్లో కరోనా పరీక్షలు చేస్తోంటే.. తెలంగాణలో వేల సంఖ్యలో కూడా చేయలేదని సంజయ్ విమర్శించారు. 


కరోనా కట్టడిపై ప్రభుత్వ పెద్దలతో చర్చకు సిద్ధమన్నారు. కరోనా అంటే.. ఓనర్లకు, క్లీనర్లకు మధ్య యుద్దం కాదని మంత్రి ఈటల గుర్తుంచుకోవాలన్నారు. జేపీ నడ్డా నిజాయితీని ప్రశ్నించే హక్కు మంత్రులకు లేదన్నారు. అబద్ధాల ముఖ్యమంత్రి కేసీఆర్ తన అహాన్ని వీడి.. వైద్యులు, పోలీసులను కాపాడాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 


Updated Date - 2020-06-22T17:39:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising