ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సడలింపులతో తెరుచుకున్న ఆటోమోబైల్స్‌, ఏసీల షాపులు

ABN, First Publish Date - 2020-05-18T21:49:38+05:30

ప్రభుత్వం కొన్నిరకాల వ్యాపారులకు సడలింపులు ప్రకటించడంతో జంటనగరాల్లోని ప్రధాన మార్కెట్‌లయిన రామ్‌కోఠి, ట్రూప్‌బజార్‌, బేగంబజార్‌ తదితర మార్కెట్‌లలో ఆటోమొబైల్‌షాపులు, ఎ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ప్రభుత్వం కొన్నిరకాల వ్యాపారులకు సడలింపులు ప్రకటించడంతో జంటనగరాల్లోని ప్రధాన మార్కెట్‌లయిన రామ్‌కోఠి, ట్రూప్‌బజార్‌, బేగంబజార్‌ తదితర మార్కెట్‌లలో ఆటోమొబైల్‌షాపులు, ఎలక్ర్టికల్‌, ఏసీ, కూలర్‌ల షాపులు తెరుచుకున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు రెండు నెలలుగా మూతపడిన మార్కెట్‌లు తాజాగా ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో వ్యాపారులు తిరిగి షాపులన తెరిచారు. ప్రభుత్వం భవన నిర్మాణ పరిశ్రమ నష్టపోకుండా ఉండేందుకు ఆ రంగానికి సంబంధించిన వ్యాపారాలను తిగిరి ప్రారంభించుకోవచ్చని ప్రకటించింది. ఈనేపధ్యంలో ప్రధాన మార్కెట్‌లు తెరుచుకున్నాయి. ప్రత్యేకించి నగరంలోనే కాదు, వివిధ జిల్లాలు, పలు రాష్ర్టాల నుంచి నిర్మాణదారులు, కొత్తగా ఇళ్లను నిర్మించుకునేవారు తమకు అవసరమైన ఉత్పత్తునలు ఈ ప్రధాన హోల్‌సేల్‌మార్కెట్‌ల నుంచే కొనుగోలుచేస్తుంటారు.


ముఖ్యంగా ఎలక్ర్టికల్‌, ఏసీలు, కూలర్లకు ప్రధాన మార్కెట్‌గా ట్రూప్‌బజార్‌ ఉంది. ఇక్కడ పూర్తిగాహోల్‌సేల్‌ ధరలకే వీటిని కొనుగోలుచేయవచ్చు. ఇక ఆటోమొబైల్స్‌కు రామ్‌కోఠి ప్రత్యేక మార్కెట్‌. ఇక్కడ కూడాహోల్‌సేల్‌ ధరలకే రక రకాల ఆటోమొబైల్‌ ఉత్పత్తులు, సెకండ్‌హ్యాండ్‌ ఉత్పత్తులు, వాహనాలను కొనుగోలుచేసే వీలుంది. సోమవారం పలువురు వ్యాపారులు  దుకాణాలను తెరుచుకుని శుభ్రం చేసుకోవడం కనిపించింది. అలాగే కరోనా వైరస్‌ వ్యాపించకుండా జీహెచ్‌ఎంసి అధికారులు కూడా క్రిమిసంహారక రసాయనాలను స్ర్పే చేశారు. మార్కెట్‌లో చెత్తాచెదారాన్నితొలగించారు. ఇక ప్రతి వ్యారుడు కూడా తమ షాపులోకి వచ్చేవారు తప్పని సరిగా మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లుచేశారు. 

Updated Date - 2020-05-18T21:49:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising