ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటో డ్రైవర్లపై ప్రైవేటు ఫైనాన్సర్ల దాడులు ఆపాలి

ABN, First Publish Date - 2020-11-03T20:52:20+05:30

ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలపై హోం శాఖ మంత్రి మహమూద్అలీకి తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలపై హోం శాఖ మంత్రి మహమూద్అలీకి తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. ట్రేడ్ యూనియన్ నాయకులు సయ్యద్ మునీరుద్దిన్,రాష్ట్ర అధ్యక్షులు వేముల మారయ్య ,అమానుల్ల్హ ఖాన్ తదితరులు హోంమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. కోవిడ్-19నేపధ్యంలో ఉపాధి కోల్పోయి ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఛిన్నాభిన్నమై అనేక రకాలుగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయని, ఈ సమయంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు భారీ వర్షాలకు జీహెచ్ఎంసి పరిధిలోని అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందేనన్నారు.


ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రైవేట్ ఆటో ఫైనాన్సర్లు ఈఎంఐలు కట్టలేదు అనే నెపంతో నిర్ధాక్షణ్యంగా నడి రోడ్డు మీదవారి ప్రైవేట్ వ్యక్తులతో డ్రైవర్లపై దాడులు చేసి ఆటోలను బలవంతంగా, చట్ట వ్యతిరేకంగా జప్తు  చేస్తూ ఇష్టానుసారంగా అమ్ముకుంటున్నారని వాపోయారు. ఈ విషయంపై  ఆటో యూనియన్ ఇతర ఆటో సంఘాలు ప్రైవేట్ పైనాన్స్ ఆఫీసుల  ముందు ధర్నాకుడా చేశామన్నారు. ఆటో డ్రైవర్లు.... లాక్ డౌన్ సందర్భంగా బకాయిలుఉన్నటువంటిఇయం. ఈఎంఐలపై  ఎలాంటి చక్రవడ్డీ లు వేయొద్దని, కరోనా తగ్గు ముఖం పట్టి మార్కెట్ చక్కపడేంత వరకు ఈఎంఐల  విషయంలో అటో డ్రైవర్లను వత్తిడి చెయ్యొద్దన్నారు. ప్రైవేట్ ఫైనాన్సు వారి చర్యల పై నిరసన వ్యక్త చేస్తూ ఆటో ఫైనాన్స్ అసోసియేషన్‌ తరపున వినతి పత్రం సమర్పించారు.


ఈ.ఎమ్.ఐ ల పై మరో ఎనిమిది నెలలు గడువు కావాలని వారు కోరారు. అప్పుడు ఒప్పుకొని ఆటో యూనియన్ హామీ ఇచ్చిన ఫైనాన్స్ అసోసియేషన్ ఇప్పుడు హామీని ఉల్లంగించి వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, దాడులు చేస్తున్నారని. ఇలాంటి వారిపై ఎక్కడ సంఘటన జరిగినా పోలీస్ స్టేషన్లో కేస్ పెడితే తీసుకొని ఆటో ఫైనాన్సర్లపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఆటో డ్రైవర్లను కాపాడాలని వారు హోంమంత్రినీ కోరారు.


Updated Date - 2020-11-03T20:52:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising