ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మావోయిస్టు మిలిటెంట్ల అరెస్టు

ABN, First Publish Date - 2020-08-03T10:52:31+05:30

ముగ్గురు మావోయిస్టు సానుభూతి పరులను పోలీసులు ఆదివారం అరెస్టు చేసి వారి వద్ద నుంచి 414 తుపాకీ, తూటాల డంప్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

414 తుపాకీ, బులెట్ల డంప్‌, విప్లవ సాహిత్యం స్వాధీనం


మహబూబాబాద్‌ క్రైం, ఆగస్టు 2 : ముగ్గురు మావోయిస్టు సానుభూతి పరులను పోలీసులు ఆదివారం అరెస్టు చేసి వారి వద్ద నుంచి 414 తుపాకీ, తూటాల డంప్‌, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. మహబూబాబాద్‌ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అరెస్టు వివరాలను వెల్లడించారు. గంగారం మండలం దుబ్బగూడెం గ్రామశివారు మామిడిగూడెం, మిర్యాలపేంటకు చెందిన బండి సుధాకర్‌ అలియాస్‌ అశోక్‌, కల్తీ సమ్మయ్య, పొలెబోయిన సారయ్య కొంత కాలంగా మావోయిస్టు పార్టీ సానుభూతిపరులుగా ఉండి కొరియర్లుగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టు పార్టీ నాయకులైన యాప నారాయణ అలియాస్‌ హరిభూషన్‌, బడె చొక్కారావు అలియాస్‌ దామోదర్‌తో పాటు మరికొంత మందికి వీరు మిలిటెంట్లుగా పనిచేస్తున్నారు.


బండి సుధాకర్‌ 2003లో టీడీపీ నాయకుడు జనగాం పాపారావును హతమార్చే ఉద్దేశంతో దళంతో కలిసి ఆయనపై దాడికి పాల్పడ్డాడు. 2009లో ఆయుధాలతో దొరకడంతో కొత్తగూడ పోలీస్‌స్టేషన్‌ కేసు నమోదైంది. కల్తీ సమ్మయ్య లింగాల గ్రామ సర్పంచ్‌గా పనిచేస్తూ జనశక్తి పార్టీలో కార్యకలాపాలు కొనసాగించాడు. అనంతరం గ్రామపంచాయతీ నుంచి మిర్యాలపేంట శివారు దుబ్బగూడెంకు మకాం మార్చాడు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి గొత్తికొయ్యలను తీసుకువచ్చి 15 ఎకరాల పోడు భూమిని ఏర్పాటు చేసుకున్నాడు. అనంతరం లింగాల అటవీ ప్రాంతంలో గొత్తికొయ్యలకు ఆశ్రయం కల్పించాడు.


అప్పటి నుంచి మావోయిస్టులు, గుత్తికొయ్యలకు సహకరిస్తున్నాడు. పొలెబోయిన సారయ్య పోలీసుల సమాచారాన్ని మావోయిస్టులకు చేరవేస్తూ దళానికి కావాల్సిన వస్తువులను సరఫరా చేస్తున్నాడు. 2006లో సారయ్య ఆయుధాలను తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఈ ముగ్గురు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ప్రమాదం ఉందని సమాచారం రావడంతో పోలీసులు అరెస్టు చేశారు. స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ సాగర్‌, గంగారం, కొత్తగూడ ఎస్సైలు, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులతో కలిసి దుబ్బగూడెంలో వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించిన డీఎస్పీ నరేష్‌కుమార్‌, గూడూరు సీఐ బాలాజీ, సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులను అందజేశారు.

Updated Date - 2020-08-03T10:52:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising