ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్బీఐ సర్క్యులర్‌పై వ్యాజ్యాల్లో ముగిసిన వాదనలు

ABN, First Publish Date - 2020-11-03T08:25:24+05:30

అనుమానాస్పద అకౌంట్లను మోసపూరిత అకౌంట్లుగా ప్రకటించి అన్ని బ్యాంకులకు సమాచారం ఇవ్వాలని ఆర్బీఐ బ్యాంకులకు జారీ చేసిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): అనుమానాస్పద అకౌంట్లను మోసపూరిత అకౌంట్లుగా ప్రకటించి అన్ని బ్యాంకులకు సమాచారం ఇవ్వాలని ఆర్బీఐ బ్యాంకులకు జారీ చేసిన మాస్టర్‌ సర్క్యులర్‌పై దాఖలైన బ్యాచ్‌ పిటిషన్లలో వాదనలు ముగిశాయి. ఈ వ్యాజ్యాల్లో సుదీర్ఘంగా వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది.

ఈ వ్యాజ్యాల్లో న్యాయవాదులు చేసిన వాదనలను రాతపూర్వకంగా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆర్బీఐ మాస్టర్‌ సర్క్యులర్‌ నేపథ్యంలో బీఎస్‌ కంపెనీ బ్యాంకు ఖాతాలను మోసపూరితమైనవిగా ఎస్‌బీఐ ప్రకటించింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఆ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. ఇదే అంశానికి సంబంధించి మరికొన్ని సంస్థలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలు సోమవారం మరోసారి విచారణకు వచ్చాయి. 


Updated Date - 2020-11-03T08:25:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising