కోడి కాళ్లపై వాగ్వాదం, హత్య!
ABN, First Publish Date - 2020-12-15T07:57:55+05:30
మద్యం మత్తులో కోడి కాళ్ల గురించి జరిగిన వాగ్వాదం, ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. హత్య చేసిన నిందితులు ఏకంగా దహన
పెద్దపల్లి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
పెద్దపల్లి టౌన్, డిసెంబరు 14: మద్యం మత్తులో కోడి కాళ్ల గురించి జరిగిన వాగ్వాదం, ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. హత్య చేసిన నిందితులు ఏకంగా దహన కార్యక్రమాలు కూడా నిర్వహించేయడం గమనార్హం. పెద్దపల్లి జిల్లా జరిగిన ఈ ఘటన, ఆలస్యంగా వెలుగుచూసింది.
ఒడిశాలోని సందరంఘడ్ జిల్లా సునాపర్వత్ గ్రామానికి చెందిన బసు జోర, పూజ లుంగీయార్, బీమ్సన్ జోరా, బయా లుంగీయార్ అనే నలుగురు వ్యక్తులు, పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లోని ఓ ఇటుక బట్టీలో నాలుగు నెలలుగా కూలీలుగా పనిచేస్తున్నారు.
ఈ నెల 9న కోడి కాళ్లు, పేగులు మార్కెట్ నుంచి తెచ్చుకుని వంట చేసుకున్నారు. ఆరోజు రాత్రి మద్యం సేవిస్తుండగా కోడి కాళ్ల విషయంలో బీమ్సన్ మిగిలిన వారిలో గొడవ పడ్డాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన బసు జోర, పూజ లుంగీయార్, బయా లుంగీయార్ ఓ చెక్క దుంగతో బీమ్సన్ తలపై బలంగా కొట్టారు. తీవ్రగాయాలపాలైన బీమ్సన్ అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు.
దీంతో కార్మికులు ఇటుక బట్టీ యజమానులు ఈసారపు శ్రావణ్, మేకల మహే్‌షకు సమాచారం ఇచ్చారు. బీమ్సన్‌ను పెద్దపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలిస్తుండగా.. బీమ్సన్ మృతి చెందాడు. ఇటుక పెళ్లలు పడిపోవడం వలన బీమ్సన్ చనిపోయాడన్నట్టుగా ప్రైవేట్ ఆస్పత్రి నుంచి మరణ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకొచ్చారు. అనంతరం.. కరీంనగర్ శ్మశాన వాటికలో మృతదేహాన్ని దహనం చేశారు. సర్టిఫికెట్ విషయంలో మరో ఇటుక బట్టీ ఓనర్ అంబటి సతీష్ సహకరించాడు. ఈ విషయం బయటికి పొక్కడంతో గీతం శ్రీనివాస్ అనే వ్యక్తి బసంత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులు బసుజోర, పూజా లుంగీయార్, బయా లుంగీయార్, శ్రావణ్, మేకల మహేష్, అంబటి సతీ్‌షను అదుపులోకి పోలీసులు తీసుకున్నారు.
Updated Date - 2020-12-15T07:57:55+05:30 IST