ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?

ABN, First Publish Date - 2020-11-21T09:34:36+05:30

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు మంత్రి జగదీశ్‌రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ, కాంగ్రె్‌సకు మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్

‌ 

హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్‌ విసిరారు. చర్చించేందుకు తాము ఎక్కడికైనా వస్తామని, ఆ దమ్ము ఆ రెండు పార్టీలకు ఉందా? అని ప్రశ్నించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని ఆరోపించారు. నిజామాబాద్‌, కరీంనగర్‌ లోక్‌సభ ఎన్నికలతో పాటు తాజాగా జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో ఈ విషయం స్పష్టమైందన్నారు. హైదరాబాద్‌ను నిర్లక్ష్యం చేసింది బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలేనని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ను దేశద్రోహి అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ సంబోధించడంపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నామని తెలిపారు. తిట్లతో ఓట్లు రాలవని హితవుపలికారు. 

Updated Date - 2020-11-21T09:34:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising