ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సూది రంధ్రంలో కరోనా యుద్ధవీరులు

ABN, First Publish Date - 2020-05-28T15:49:25+05:30

నగరానికి చెందిన స్వర్ణకారుడు, సూక్ష్మశిల్పి మట్టెవాడ అజయ్‌కుమార్‌ కోవిడ్‌-19 నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌ : నగరానికి చెందిన స్వర్ణకారుడు, సూక్ష్మశిల్పి మట్టెవాడ అజయ్‌కుమార్‌ కోవిడ్‌-19 నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను ప్రతిబింబిస్తూ సూది రంధ్రంలో అయిదు సూక్ష్మ శిల్పాలను ప్రత్యేకమైనంతో చెక్కి వాటికి రంగులు వేశా డు. కరోనా వైరస్‌ మాస్క్‌ పెట్టుకొని రెండు చేతులు జోడించి డాక్టర్స్‌, నర్స్‌, పోలీసు, పారిశుధ్య కార్మికులకు మొక్కుతున్నట్టు ఈ శిల్పాలను చెక్కాడు.


కరోనా వైర్‌సకు మాస్క్‌, డాక్టర్‌కు పీపీఈ దుస్తులు.. మెడలో స్టెతస్కోప్‌.. చేతికి గ్లౌజులు, నర్సుకు మాస్క్‌.. చేతిలో ఫైల్‌, యూనిఫామ్‌లో ఉన్న పోలీసు.. చేతిలో లాఠీ.. డ్రెస్‌కు మెడల్స్‌, పారిశుధ్య కార్మికుడికి మాస్క్‌.. చేతిలో చీపురు పట్టుకున్నట్లుగా ఈ శిల్పాలను చెక్కారు. మైక్రోస్కోప్‌ ద్వారా చూస్తే చాలా స్పష్టంగా కనిపించేలా వీటిని రూపొందించారు. ఈ శిల్పాల సైజులు 1.20ఎంఎం నుంచి 0.90ఎంఎం వరకు ఎత్తు, 0.36 ఎం నుంచి 0.15ఎంఎం వరకు వెడల్పు ఉన్నాయి. వీటిని 22రోజుల్లో రూపొందించారు.

Updated Date - 2020-05-28T15:49:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising