‘కరోనా’ వైద్యసేవలకు అపోలో సిద్ధం
ABN, First Publish Date - 2020-03-27T11:06:08+05:30
కరోనా వైరస్ పీడితులు, అనుమానితులకు వైద్య సేవలు అందించడానికి అపోలో ఆస్పత్రి సిద్ధమవుతోంది. ఈ మేరకు చెన్నై, హైదరాబాద్ ఆస్పత్రి
ఐసోలేషన్ వార్డులు, వ్యాధి నిర్ధారణ... మొదట హైదరాబాద్‌లో!
వర్చువల్ మీడియా భేటీలో అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి
హైదరాబాద్ సిటీ, మార్చి 26(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ పీడితులు, అనుమానితులకు వైద్య సేవలు అందించడానికి అపోలో ఆస్పత్రి సిద్ధమవుతోంది. ఈ మేరకు చెన్నై, హైదరాబాద్ ఆస్పత్రి ప్రతినిధులు గురువారం విలేకరుల వర్చువల్ సమావేశంలో మాట్లాడారు. ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ శోభన కామినేని, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ వైద్య సేవలను తొలుత హైదరాబాద్‌లో ప్రారంభిస్తామని, తరువాత ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబైలకు విస్తరిస్తామన్నారు.
ప్రాజెక్ట్ కవచ్ పేరిట.. ఒక ప్రణాళిక, సమాచారం, స్ర్కీనింగ్, పరీక్షలు చికిత్సకు కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ప్రకటించారు. తొలుత 250 పడకలతో ఐసోలేషన్ వార్డులను అందుబాటులోకి తీసుకొస్తామని, అవసరాల మేరకు సంఖ్యను పెంచుతామని తెలిపారు. కరోనా బాధితుల్లో 15 శాతం మాత్రమే క్లిష్టమైన రోగులు ఉంటారని, వీరికి తగిన సదుపాయాలు కల్పిస్తామన్నారు.
Updated Date - 2020-03-27T11:06:08+05:30 IST