ప్రకృతి వైద్యుడు రామచందర్‌రావుకు ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ పురస్కారం
ABN, First Publish Date - 2020-11-13T09:02:43+05:30
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన ప్రకృతి వైద్యుడు రామచందర్‌రావును డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ పురస్కారం వరించింది.
నేలకొండపల్లి, నవంబరు 12: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన ప్రకృతి వైద్యుడు రామచందర్‌రావును డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ పురస్కారం వరించింది. ఆరోగ్య రంగంలో ఆయన సుదీర్ఘకాలం పాటు చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఢిల్లీ సుప్రీంకోర్టు ఫౌండేషన్, క్యాపిటల్ ఫౌండేషన్ అండ్ జడ్జెస్, కృష్ణయ్య ఫౌండేషన్‌లు సంయుక్తంగా ఆయనకు ఈ అవార్డును ప్రకటించాయి.
ఈనెల 15న ఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో కేరళ గవర్నర్ అరీఫ్ మహ్మద్‌ఖాన్ ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. డాక్టర్ రామచందర్‌రావు, పద్మ దంపతులు గత 22 సంవత్సరాలుగా లక్ష మంది ప్రజల ఇళ్లల్లోకి ప్రకృతి వైద్య విధానాన్ని తీసుకెళ్లారు.
‘‘ఇల్లే వైద్యశాల, వంట గదే మందుల దుకాణం, ఆహారమే ఔషధం, అమ్మే డాక్టర్’’ వంటి నినాదాలు ఎంతో మంది ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని కలిగించాయి. ఆయనకు పురస్కారం ప్రకటించడంపై నేలకొండపల్లి వాసులు హర్షం వ్యక్తం చేశాయి.
Updated Date - 2020-11-13T09:02:43+05:30 IST