ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం చెప్పినా ఏపీ వినడం లేదు

ABN, First Publish Date - 2020-08-09T09:14:33+05:30

పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకాల విషయమై కేంద్రం చెప్పినా ఏపీ ప్రభుత్వం వినడం లేదని, అందుకే తాము సుప్రీంకోర్టుకు వెళ్లామని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అందుకే సుప్రీంకు వెళ్లాం: మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌


హైదరాబాద్‌, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకాల విషయమై కేంద్రం చెప్పినా ఏపీ ప్రభుత్వం వినడం లేదని, అందుకే తాము సుప్రీంకోర్టుకు వెళ్లామని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి ముందే సుప్రీం కోర్టు ఉత్తర్వులు తెచ్చేందు కు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రెండు, మూడు రోజుల్లోనే సుప్రీం కోర్టు ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని సుప్రీం కోర్టులో కేసు వేశామని, అందులో కర్ణాటక, మహారాష్ట్రల ప్రస్తావన లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద శనివారం ఆయన మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతలతో దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్‌ నేతలు చెప్పడం.. దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. టీఎంసీ అంటే తెలియని నేతలు కృష్ణ జలాల గురిం చి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ వల్లే ప్రాజెక్టులు జాప్యమవుతున్నాయని, ఆర్డీఎ్‌సకు, ఆర్డీఎక్స్‌కు తేడా తెలియని నేతలు ఇరిగేషన్‌పై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు మాట్లాడుతూ పాలమూరును ఎండబెట్టిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు.  


Updated Date - 2020-08-09T09:14:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising