ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ లహరి కేసులో మరో వీడియో... వెలుగులోకి భర్త ఆకృత్యాలు

ABN, First Publish Date - 2020-07-14T00:23:58+05:30

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ లావణ్య లహరి కేసులో కొత్త విషయాలు ఒక్కొక్కటి వెలుగు వస్తున్నాయి. సోమవారం ఈ కేసులో మరొక వెలుగులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ లావణ్య లహరి కేసులో కొత్త విషయాలు ఒక్కొక్కటి వెలుగు వస్తున్నాయి. సోమవారం ఈ కేసులో మరొక వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో 13 నిమిషాల పాటు తన బాధలను లహరి చెప్పుకుని వాపోయింది. తన భర్త వెంకటేష్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు లహరి మరోసారి తెలిపింది. ఇటీవల శంషాబాద్‌లో లహరి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో భర్తతో పాలు అత్తమామలన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 


కొత్త వీడియో సారాంశం 

వెంకటేష్‌ను ఉద్దేశించి లహరి తీసిన సెల్ఫ్ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘‘వెంకటేష్ ప్రేమ పేరుతో నా వెంట పడ్డావు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డాను. మతం మార్చుకుంటానని నమ్మబలికావు. పెళ్లి చేసుకున్నాక నీ విశ్వరూపం నాకు తెలిసింది. నీకు ఉద్యోగం లేకపోయినా సంవత్సరాల తరబడి నేనే పోషించాను. ఉద్యోగం వచ్చాక చిత్రహింసలు పెట్టావు.  ప్రతిరోజు నన్ను కొట్టే వాడివి ప్రతి రోజు నన్ను బూతులు తిట్టే వాడివి. మీ కుటుంబసభ్యుల ముందు కూడా నన్ను కొట్టావు. అమ్మాయిలతో చెడు తిరుగుళ్లు తిరిగావు. అమ్మాయిలతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేశావు. నువ్వు చేసేది తప్పు అని ఎదిరిస్తే నన్నే కొట్టావు. నీవు పెట్టిన బాధను భరిస్తూ వచ్చాను. నేను సంపాదించిన ఆస్తి మొత్తం నీ ఆస్తిగా చెప్పుకున్నాం. ఇన్ని చిత్రహింసలు పెట్టినా ఇప్పటికీ నీ మీద ప్రేమ ఉంది’’ అంటూ భర్తకు వీడియోను లహరి పోస్ట్ చేసింది. 13 నిమిషాల వీడియోలో తన బాధలు ఆమె చెప్పుకుంది. తల్లిదండ్రులను క్షమించమని లహరి కోరింది.


ఇటీవల పోలీసుల విచారణలో కూడా వెంకటేష్ ఆకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. వెంకటేష్ ఆకృత్యాలు భరించలేక లహరి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులు వాపోతున్నారు. పైలట్ సరీనాతో వెంకటేష్‌కు శారీరక సంబంధం ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. ఆఫీస్ పని పేరుతో సరీనాతో కలిసి విదేశాల్లో వెంకటేష్‌ గడిపినట్లు సమాచారం. ఫ్లైట్ టికెట్‌, వాట్సాప్‌ చాటింగ్‌లు, లైవ్‌ చాటింగ్‌తో వెంకటేష్‌ పట్టుబడ్డాడు. ఆమె ముందే సరీనాతో వెంకటేశ్‌ వీడియోకాల్ మాట్లాడాడు. ఈ నేపథ్యంలోనే వెంకటేష్ ఆకృత్యాలపై లహరి నిలదీసింది. సరీనాకు ఫోన్‌ చేసి తనకు అన్యాయం చేయొద్దని లహరి వేడుకుంది. సరీనాను నిలదీయడంతో వెంకటేశ్‌ రెచ్చిపోయాడు. సరీనాకు ఫోన్‌ చేసినందుకు లహరిపై కొన్నాళ్లుగా వెంకటేష్‌ దాడికి పాల్పడ్డట్లు వెల్లడైంది. 


లహరి, వెంకటేష్‌లది ప్రేమ వివాహం. భర్తంటే ఆమెకు చచ్చేంత ప్రేమ. అతడేమో పిల్లలు పుట్టడం లేదనే నెపంతో ఆమెను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడు. అంతేకాదు లహరిపై చేయిచేసుకునేవాడు. అందుకు సాక్ష్యంగా కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. లహరిని వెంకటేష్ కొడుతున్నప్పుడు వారి పెంపుడు కుక్క అడ్డం పోయింది. దీంతో అతడు వెనక్కి తగ్గాడు. వెంకటేష్ దుర్మార్గాలన్నీ వాళ్ల ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా.

Updated Date - 2020-07-14T00:23:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising