ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓరుగల్లుకు మరో ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ

ABN, First Publish Date - 2020-02-13T00:03:38+05:30

తెలంగాణ రెండవ రాజ‌ధాని వరంగల్‌లో పారిశ్రామికాభివృద్ధికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, మంత్రి తారకరామారావు తీసుకుంటున్న చ‌ర్య‌లు స‌ఫ‌లమవు‌తున్నాయని శాస‌న మండ‌లి స‌భ్యుడు పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి పేర్కొన్నారు. సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌ల విజ్ఞ‌ప్తుల మేర‌కు, వ‌రంగ‌ల్‌ను ఐటీ రంగంలో అగ్ర‌గామిగా తీర్చిదిద్దే య‌జ్ఞంలో ఒక్కో కంపెనీ భాగ‌స్వామ్యమవుతున్నాయన్నారు. వ‌రంగ‌ల్ స‌మీపంలోని మడికొండలోని ఐటీపార్కులో ఇప్పటికే దిగ్గజ కంపెనీలైన టెక్‌ మహీంద్రా, సైయెంట్‌ తమ బ్రాంచీలను ఏర్పాటు చేశాయన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్ : తెలంగాణ రెండవ రాజ‌ధాని వరంగల్‌లో పారిశ్రామికాభివృద్ధికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, మంత్రి తారకరామారావు తీసుకుంటున్న చ‌ర్య‌లు స‌ఫ‌లమవు‌తున్నాయని శాస‌న మండ‌లి స‌భ్యుడు పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి పేర్కొన్నారు.  సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌ల విజ్ఞ‌ప్తుల మేర‌కు, వ‌రంగ‌ల్‌ను ఐటీ రంగంలో అగ్ర‌గామిగా తీర్చిదిద్దే య‌జ్ఞంలో ఒక్కో కంపెనీ భాగ‌స్వామ్యమవుతున్నాయన్నారు. వ‌రంగ‌ల్ స‌మీపంలోని మడికొండలోని ఐటీపార్కులో ఇప్పటికే దిగ్గజ కంపెనీలైన టెక్‌ మహీంద్రా, సైయెంట్‌ తమ బ్రాంచీలను ఏర్పాటు చేశాయన్నారు.


సీఎం కేసీఆర్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ చొరవతో మరో అంతర్జాతీయ ఐటీ కంపెనీ మైండ్‌ట్రీ కూడా వరంగల్‌లో తన కార్యకలాపాలను సాగించేందుకు ముందుకొచ్చిందని చెప్పారు. తాజాగా, క్వాడ్రంట్‌ రిసోర్స్‌ సెంటర్... 1.5 ఎకరాల్లో తన శాఖను ఏర్పాటు చేయనుందని, ఈ ఐటీ సెంటర్‌ ద్వారా స్థానికంగా 500 మందికి ఉపాధి లభించనుందని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. 


ఇందుకు సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌ల‌తోపాటు క్వాడ్రంట్‌ వ్యవస్థాపకుడు, సీఈవో వంశీరెడ్డికి శ్రీ‌నివాస‌రెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ నెల 16 న వరంగల్‌లో క్వాడ్రంట్‌ రిసోర్స్‌ ఐటీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు కెటిఆర్, మ‌రో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావులు శంకుస్థాపన చేయనున్నట్లు, ఇది హర్షణీయమని పేర్కొన్నారు.


తెలంగాణ‌లో ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సిఎం కెసిఆర్,  మంత్రి కెటిఆర్ తీసుకుంటున్న చొర‌వ‌ వ‌ల్లే వరంగల్‌ జిల్లాకు ప్రముఖ ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయని, ఐటీ కంపెనీల రాకతో స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి లభించే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. 

Updated Date - 2020-02-13T00:03:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising